క్యాన్సర్: కారణాలు, లక్షణాలు మరియు ప్రమాద కారకాలు, చికిత్స విధానాలు

క్యాన్సర్ అంటే ఏమిటి ? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అనియంత్రితంగా విభజన చెంది కణ సమూహాలుగా ఏర్పడే స్థితినే క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను ‘కణితి’ (ట్యూమర్) అని పిలుస్తారు. ఛాతీ, లంగ్స్, చర్మ, గొంతు, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ వంటి దాదాపు 100కు పైగా క్యాన్సర్ వ్యాధి రకాలు ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధి అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ, వయస్సు పెరుగుతున్న కొద్ది ఈ వ్యాధి ముప్పు ఎక్కువ.. క్యాన్సర్ కణాలు ముందుగా స్థానిక కణజాలం పైన దాడి చేసి వాటిని నాశనం చేయడమే కాకుండా మన శరీరంలోని రక్తం మరియు శోషరస వ్యవస్థ (lymphatic system) ద్వారా ఇతర బాగాలకు కూడా వ్యాపించడాన్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ మానవ శరీరంలో దాదాపు ఎక్కడైనా రావొచ్చు. ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేక పోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్ల చాలా కేసుల్లో వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత గుర్తిస్తుండటంతో పరిస్థితి చేయి దాటిపోయి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. క్యాన్సర్స్ రావడానికి ముఖ్య కారణాలు: మన శరీర కణాలు పని చేసే విధానం, విభజన ప్రక్రియలని నియంత్రించే నిర్దిష్ట DNA లోని జన్యు పరమైన మార్పులు కాన్సర్ కి కారణమవుతాయి. క్యాన్సర్ యొక్క లక్షణాలు: క్యాన్సర్ వల్ల వచ్చే సంకేతాలు మరియు లక్షణాలు శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేశాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటాయి, క్యాన్సర్ యొక్క ప్రమాద కారకాలు: క్యాన్సర్ యొక్క రకాలు: క్యాన్సర్‌ను ప్రధానంగా అవి ప్రారంభమయ్యే కణ రకాన్ని బట్టి వర్గీకరించవచ్చు క్యాన్సర్ యొక్క దశలు: చాలా క్యాన్సర్లలో 4 దశలు ఉంటాయి. అయితే శరీరంలో కణితి స్థానం మరియు పరిమాణం బట్టి వివిధ దశలుగా వర్గీకరించవచ్చు. క్యాన్సర్ కు చేసే పరీక్షలు: సాధారణ క్యా న్స ర్ చికిత్స లు: ఈ మధ్య కాలంలో కాన్సర్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది . ఇది సక్సెస్ అవ్వడం అనేది క్యాన్సర్ రకాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది కాన్సర్ కి సరైన ట్రీట్మెంట్ సక్సెస్ గా చేయగలుగుతున్నారు .కొత్త మందులు, ఇమ్మ్యూనోథెరపీ కాన్సర్ ట్రీట్మెంట్ ని మెరుగుపరిచాయని డాక్టర్స్ చెబుతున్నారు. ఎప్పటికప్పుడు క్యా న్స ర్ పరీక్షలు చేయంచుకుంటూ.. క్యా న్స ర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వా రా క్యా న్స ర్ మరణాల్లో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు . Dr. Nivalika RajamoniDNB RadiotherapyConsultant Radiation Oncologist